జిల్లాలో 40,197 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 4,34,397 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 7,943 డ్వాక్రా సంఘాలు బీ గ్రేడ్‌లో ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు (స్వయం సహాయక సంఘాలు) పనితీరును బట్టి వారికి గ్రేడ్‌లు నిర్ణయిస్తారు. డ్వాక్రా మహిళలు వారు తీసుకున్న రుణాలను, పొదుపు సకాలంలో చెల్లిస్తే ఏ గ్రేడ్‌గాను, రుణాలు చెల్లించడంలో జాప్యం చేసినట్టయితే బీ, సీ గ్రేడ్‌లు ఇస్తారు. అయితే డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరే దీనికి కారణమన్న విమర్శలున్నాయి.


