విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Jul 20 2026 1:08 AM | Updated on Jul 20 2026 1:08 AM

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు ● ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ● జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి మోదీ ● రూ.4.592 కోట్లతో తొలి దశ పూర్తి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

● ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ● జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి మోదీ ● రూ.4.592 కోట్లతో తొలి దశ పూర్తి

విజయనగరం అర్బన్‌: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. జిల్లాలోని భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూ రి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయా న్ని ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, రోడ్లు భవనా ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబా బు ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కలిసి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. ప్రధాని పర్యటనలో భాగంగా చేపట్టాల్సిన విధులను వివిధ విభాగాలుగా విభజించి, ఐఏఎస్‌ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం : కలెక్టర్‌

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధా ని పర్యటన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పకడ్బందీగా బందోబస్తు : ఎస్పీ

ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ ప్రధాని పర్య టన నిమిత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయానికి భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా పార్కింగ్‌ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ఉత్తరాంధ్రకు మణిహారంగా ఎయిర్‌పోర్ట్‌

సుమారు రూ.4,592 కోట్ల భారీ వ్యయంతో తొలి దశలో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యా టక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు కేంద్ర బిందువుగా మారనుంది.

పూసపాటిరేగ: ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌, మంత్రి శ్రీనివాస్‌ ఆదివారం సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో గుర్తించిన ఐదు లేఔట్లలో సుమారు ఆరు వేల వాహనాల పార్కింగ్‌కు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కంచేరు నుంచి ముంజేరు వరకు ఉన్న రహదారిని వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌, ప్రజా వేదికను సందర్శించి, నిర్మాణ పనులను, ఏర్పాట్లును పరిశీలించి, సంబంధిత అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశా రు. పరిశీలనలో ఎమ్మెల్యే నాగమాధవి, అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఆర్‌డీఓ సుధాసాగర్‌, ఎయిర్‌పో ర్టు ప్రాజెక్టు హెడ్‌ రామరాజు, రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement