విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజావ్యతిరేక, అభివృద్ధి నిరోధక పాలన సాగిస్తోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. హామీల అమలుపై అబద్ధపు ప్రచారాలు చేస్తోందన్నారు. కూటమి మోసకారి పాలన జగన్ 2.0 యాప్‌తో బట్టబయలవుతుందని తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో జగన్ 2.0 యాప్‌ను విజయనగరం నియోజకవర్గ నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ 2019–24 హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటతప్పకుండా ఇచ్చిన హమీలన్నీ అమలు చేసినా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన తప్ప ప్రజాసంక్షేమ పాలన కనిపించడంలేదన్నారు. చంద్రబాబు మోసకారి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘జగన్ 2.0’ యాప్ దోహదపడుతుందన్నారు. ఈ యాప్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందులో కూటమి ప్రభు త్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగట్టవచ్చని, అలాగే, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయవచ్చన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి బాధ్యతగల ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ రూపొందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్/వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, ఎంపీపీ మామిడి.అప్పలనాయుడు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, పార్టీ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, నియోజకవర్గ బూత్‌లెవెల్ కమిటీ కన్వీనర్ బండారు ఆనంద్, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, బొంగభానుమూర్తి, జి.వి.రంగారావు, అల్లు చాణక్య, తదితరులు పాల్గొన్నారు.
హమీల అమలుపై అబద్ధపు
ప్రచారాలు
కూటమి మోసకారి పాలన
బట్టబయలు చేసేందుకు
జగన్ 2.0 యాప్
ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి


