అధికారమే నోటిఫికేషన్‌..! | - | Sakshi
Sakshi News home page

అధికారమే నోటిఫికేషన్‌..!

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

అడ్డగోలుగా ఐసీడీఎస్‌లో పోస్టుల భర్తీ

విస్తుపోతున్న నిరుద్యోగులు

విజయనగరం ఫోర్ట్‌: ఏ ప్రభుత్వ సంస్థలో అయినా కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే నోటిఫికేషన్‌ ఇస్తారు. వాటిలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు. అయితే, ఐసీడీఎస్‌లో నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నాయకుల మాటే ఉత్తర్వులుగా భావించి పోస్టులు భర్తీచేసే శారు. దీనిపై నిరుద్యోగులు గుర్రుమంటున్నారు. ఇదెక్కడి కొత్త ఉద్యోగ రాజ్యాంగం అంటూ విమర్శిస్తున్నారు.

నోటిఫికేషన్‌ లేకుండా...

ఐసీడీఎస్‌ పరిధిలో చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ నడుస్తోంది. వీటిలో అవుసోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీగా ఉన్న జిల్లా కో ఆర్డినేటర్‌ పోస్టులు–2, సూపర్‌ వైజర్‌ పోస్టు–1, కేస్‌ వర్కర్‌ పోస్టు–1, కౌన్సిలర్‌ పోస్టు–1ను ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా నాలుగురోజుల కిందట గుట్టుచప్పుడుగా భర్తీ చేశారు. సంబంధిత ఉద్యోగులు విధుల్లో కూడా చేరిపోయారు. ఈ పోస్టుల భర్తీలో ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సర్కారు తీరును చూసి ఆవేదన చెందుతున్నారు.

నోటిఫికేషన్‌ ఇవ్వలేదు..

చైల్డ్‌లైన్‌ 1098లో నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. డైరెక్టరేట్‌ నుంచి నలుగురు ఉద్యోగులను పంపించారు.

– కె.వి.బాలామణి,

జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement