● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 222 జల్‌జీవన్ మిషన్ పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో తాగునీటి సదుపాయంలేని 97 అంగన్‌వాడీ కేంద్రాలకు తక్షణమే సరఫరా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఐసీడీఎస్ పీడీ బాలామణి, తదితరులు పాల్గొన్నారు.


