● జేసీ ఎస్.సేతుమాధవన్
విజయనగరం అర్బన్: రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ కీలక అంశాలు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అమలు తీరు, పెండింగ్ పనుల పురోగతి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణల నిర్వహణ, తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జేసీ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేమయ్యారు. జిల్లాలో చేపట్టాల్సిన ఎన్నికల విధులను, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
24న మెగా పేరెంట్ టీచర్ మీట్
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ‘మెగా పేరెంట్–టీచర్ మీట్’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం కల్పించాలని, పాఠశాల స్థాయిలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు శాతాన్ని పెంచడంలో అభ్యాస ఫలితాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమగ్రంగా చర్చించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాన్ని జిల్లాలో వియవంతం చేయడానికి విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
గిరిజన వర్సిటీలో నాణ్యమైన విద్య
● ఇన్‌చార్జి వీసీ టి.శ్రీనివాసన్
● వర్సిటీలో యూజీ ప్రవేశాల
బ్రోచర్ ఆవిష్కరణ
● ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
విజయనగరం రూరల్: గిరిజన, గ్రామీణ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందించడమే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రధాన ధ్యేయమని ఇన్‌చార్జి వీసీ టి.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. విద్యార్థులు విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రవేశాల బ్రోచర్‌ను ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్‌మిశ్రాతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు, వసతుల కల్పనకు వర్సిటీ యంత్రాంగం కృషిచేస్తోందన్నారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశాల బ్రోచర్‌ను పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కార్యాలయ పనివేళల్లో యూనివర్సిటీ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి వివిధ విభాగాల్లో హానర్స్, హానర్స్ విత్ రిసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఎస్సీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ బోటనీ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ జియాలజీ, బీబీఏ (ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ ముక్కామల శరత్ చంద్రబాబు, ప్రవేశాల కమిటీ చైర్మన్ కలిదిండి సురేష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, ఇతర వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.


