రామభద్రపురం: మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధిలోని నేరళ్లవలస గిరిజన గ్రామంలో వారం రోజులుగా పిల్లల నుంచి పెద్దలు వరకు జ్వరాలు కలవరపెడుతున్నాయి. కొందరు జ్వరపీడితులు సాలూరు, బాడంగి సీహెచ్‌సీలలో వైద్యసేవలు పొందుతుండగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు సైతం వైరల్ జ్వరాలబారిన పడినట్టు సమాచారం. సమాచారం అందుకున్న రామభద్రపురం పీహెచ్‌సీ వైద్యాధికారులు లక్ష్మి, దిలీప్‌కుమార్ గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో 92 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కలుషిత తాగునీరు, దోమల కారణంగానే జ్వరాలు సోకుతున్నట్లు జ్వరపీడితులు, గ్రామస్తులు చెబుతున్నారని వైద్య సిబ్బంది తెలిపారు.
గ్రామానికి తాగునీరు సరఫరా అయ్యే
మంచినీటి ట్యాంకు దుస్థితి


