మొలకెత్తని విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని విత్తనాలు

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

లబోదిబో మంటున్న రైతులు

గుర్ల: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన వరి విత్తనాలు మొలక శాతం తక్కువగా ఉండడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. వరి విత్తనాల్లో కనీసం 30 శాతం కూడా మొలకెత్తలేదని చెబుతున్నారు. గుర్ల రైతు సేవా కేంద్రానికి 30 కేజీలు బరువు ఉన్న 300 బస్తాలను గుర్ల, గోషాడ రైతులకు గతనెల 25న పంపిణీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి వరి విత్తనాలను రైతులు పొలాల్లో విత్తారు. 30 శాతం మేర అయినా మొలకెత్తలేదని, ప్రభుత్వమే ఇలాంటి నాసిరకం విత్తనాలు సరఫరా చేయడంతో ఏం చేయాలో తెలియడంలేదంటూ మంత్రి సత్యం, పొదిలాపు అప్పలనాయుడు, బోడసింగి అప్పలనాయుడు, దొంతల సూర్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని ఏఓ తిరుపతిరావు వద్ద ప్రస్తావించగా వరినారు మడులను పరిశీలించామని, మొలకెత్తని విషయాన్ని ఏపీ సీడ్స్‌ అధికారులకు తెలియజేశామన్నారు.

గుర్లలో

30 శాతం మొలకలు వచ్చిన వరి నారుమడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement