అతిథుల కోసం విఐపీ లాంజ్‌ .. | - | Sakshi
Sakshi News home page

అతిథుల కోసం విఐపీ లాంజ్‌ ..

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

విజయనగరం క్రైమ్‌: ముఖ్యమైన అతిథులు జిల్లాకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన వీఐపీ లాంజ్‌ను ఐదో ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ రవిశంకర రెడ్డి బుధవారం ప్రారంభించారు.అలాగే కళాశాలలో శిక్షణ పొందుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన జిమ్‌ను ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ రవిశంకరరెడ్డి మాట్లాడుతూ.. పీటీసీ ప్రిన్సిపాల్‌ రామచంద్రరాజు ఆలోచనల మేరకు వీఐపీల కోసం లాంజ్‌ నిర్మించడం అభినందనీయమన్నారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వీఐసీ లాంజ్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ ఏఏస్పీ పి.శ్రీకాంత్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీలు టి.రమేష్‌, ఎం.చంద్రశేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు నీలిమ, వాసుదేవ్‌, నరేష్‌, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement