శతపతి అన్నపూర్ణకు ఎస్‌డీజీ చాంపియన్ అవార్డు
రామభద్రపురం: స్థానిక కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శతపతి అన్నపూర్ణకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఎస్‌డీజీ చాంపియన్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నేపాల్ దేశ సీ్త్ర శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి భగవతి చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డు తాను అందుకున్నట్లు అన్నపూర్ణ సాక్షికి తెలిపారు. సీడీసీ సుస్థిర గ్రామీణాభివృద్ధిపై గ్రామ స్థాయిలో మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర సేవలకు ఈ అవార్డు లభించిదని ఆమె చెప్పారు. ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.
ధాన్యం ఎత్తుకెళ్లిపోతున్న దొంగలు
● ఆందోళనలో రైతులు
భామిని: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వడ్డంగి రోడ్డులో ఉన్న కళ్లంలో 31 బస్తాలను అపహరించుకుపోయారు. దీంతో బాధిత రైతులు ముదుల పోలినాయుడు, కీర్తి మోహనరావు, బోదెపు ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట నేరడి–బికి చెందిన రైతు వలరౌతు దండాసికి చెందిన 13 బస్తాల దాన్యం దొంగలించుకుపోయారు. అలాగే బత్తిలికి చెందిన అప్పన్న అనే రైతు సింగుబై కళ్లంలో వేసిన ధాన్యం రాశి నుంచి పది బస్తాల వరకు ధాన్యం చోరీ చేశారు. సరిహద్దు ఒడిశా గ్రామాలకు చెందిన దొంగలే ధాన్యం దోచుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు.
డెంకాడ: మండలంలోని బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు (59) బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని విజయనరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.20 గంటలకు మృతి చెందాడు. మృతుడి మనవడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన మహిళ..
భామిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సతివాడకు చెందిన మండల అప్పలమ్మ (54) ఈ నెల 23న సతివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతదేహానికి ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శతపతి అన్నపూర్ణకు ఎస్‌డీజీ చాంపియన్ అవార్డు
శతపతి అన్నపూర్ణకు ఎస్‌డీజీ చాంపియన్ అవార్డు


