గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు..
పార్వతీపురం: గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణరావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఆలిండియా ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ గిరిజన భవనంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన గిరిజను ల హక్కులు, వారి కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. రానురాను గిరి జనులకు భద్రత కరువవుతోందని, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి కలుగుతోందన్నా రు. గిరిజనులకు రక్షణగా ఉన్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అటు అధికారు లు, ఇటు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండి, పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గిరిజనులకు అన్యా యం జరిగితే మూకుమ్మడిగా పోరాటం చేయాలని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనునిత్యం పోరాడాలన్నారు. అనంతరం ఆలిండియా ఆదివా సీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు.


