ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలి
మక్కువ: ఏపీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ సాలూరు డిపో మేనేజర్ ఆచారి కోరారు. ఈ మేరకు మక్కువలోని ఏపీఎస్‌ఆర్టీసీ పార్సిల్, కొరియర్ ఆఫీస్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్కువ నుంచి ఇతర ప్రాంతాలకు వివిధ వస్తువులను చేరవేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను పూర్తిస్థాయిలో అందిస్తున్నామన్నారు. వినియోగదారుల వస్తువులను సకాలంలో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలాసీలు, వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్గో సేవల పట్ల వినియోగదారులు తగిన సూచనలు, సలహాలు అందజేయాలని కోరారు. వ్యాపార అభివద్ధికి తగు సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రం మక్కువ నుంచి విశాఖ, విజయనగరం పట్టణాలకు చేరుకునేందుకు డైరెక్ట్ బస్సులు లేక ప్రయాణికులు, విద్యార్థులు, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని డిపో మేనేజర్ ఆచారి దృష్టికి పలువురు తీసుకెళ్లగా పూర్తిస్థాయిలో పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవా నిర్వాహకుడు వెంకట తిరుమల విశ్వనాథం, కలాసీలు పాల్గొన్నారు.


