ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్
విజయనగరం క్రైమ్: స్థానిక పోలీస్ బ్యారెక్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్ పేరిట వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది.ఈ పోటీలను ఏఎస్పీ సౌమ్యలత ప్రారంభించారు. ఇటీవలే ఏఆర్ విభాగానికి చెందిన సీహెచ్.గోపాలరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్మారకార్థం ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిద్దామని పోలీస్‌శాఖ అడ్మిన్ ముందుంచారు. ఏఎస్పీ అనుమతితో పరేడ్ మైదానంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు అన్ని పోలీస్‌స్టేషన్ల నుంచి లా అండ్ ఆర్డర్, ఏఆర్‌కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఏఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ గోపాల్ రావును స్మరించుకుంటూ తోటి సిబ్బంది ఈ పోటీలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్‌లో విజయనగరం, గంట్యాడ, కొత్తవలస, బలిజిపేటకు చెందిన టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.12 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.8 వేలు, తృతీయస్థానంలో నిలిచిన జట్టుకు రూ.6 వేలు, కన్సొలేషన్ ప్రైజ్‌కు రూ.4 వేల నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, ఆర్‌ఐలు గోపాల్‌రావు, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్సైలు సూర్యనారాయణ, రామారావు, ముబారక్ ఆలీ, దివంగత కానిస్టేబుల్ సతీమణి శారద పాల్గొన్నారు.
ప్రారంభించిన ఏఎస్పీ


