అవయవదాతకు అంతిమ వీడ్కోలు
రాజాం సిటీ: రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన గెడ్డాపు ఎర్రయ్య (39) స్థానిక వాటర్ ప్లాంట్‌లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నెల 16న ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రాగోలు జెమ్స్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 26న బ్రెయిన్‌డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి డబ్బాడ వెంకటరమణ సాయంతో కుటుంబ సభ్యులకు అవయువ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో శనివారం అవయవ దానం చేసిన అనంతరం ఎర్రయ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. మృతదేహం గ్రామానికి వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం–శ్రీకాకుళం రోడ్డుకు చేరుకున్నారు. అవయువ దాత అమర్‌రహే అంటూ అంతిమయాత్ర నిర్వహించారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అవయవదాతకు అంతిమ వీడ్కోలు


