శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ
రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలవగా వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు, పనసలవలస గ్రామానికి చెందిన వైష్ణవాచార్యపీఠాధిపతి తిరుమల రంగనాథం, అయ్యప్ప గురుస్వామి శేషు తెలిపారు.
ఇలా అయితే గ్రామాల్లో తిరగలేం...
● మంత్రి వద్ద వాపోయిన కార్యకర్తలు
దత్తిరాజేరు: మండలంలోని చుక్కపేటలో టీడీపీ మండలాధ్యక్షుడు చప్ప చంద్రశేఖరరెడ్డి సమక్షంలో పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. గదబవలస గ్రామానికి రోడ్డు నిర్మాణంలో జాప్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని, తమను నిలదీస్తున్నారంటూ సీనియర్ నాయకుడు సూర్యనారాయణ వాపోయారు. అర్హులకు పింఛన్లు మంజూరు కావడంలేదు... సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు.. కార్యకర్తలకు కూడా పథకాలు అందడం లేదు.. పల్లెల్లో తిరగలేకపోతున్నామని, ఇలా అయితే భవిష్యత్తులో కష్టమేనంటూ పలువురు నాయకులు మంత్రి వద్ద విచారం వ్యక్తంచేయడం గమనార్హం.


