
ఐక్యతకు కారణం అంబేడ్కర్
విజయనగరం అర్బన్: విభిన్న మతాలు, జాతులతో కూడిన దేశం నేటికీ ఐక్యంగా ఉందంటే అది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగమే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సోమ వారం అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రితో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ సేతు మాధవన్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి.చిట్టిబాబు, జిల్లా అధికారులు, పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు స్థానిక జొన్నగుడ్డిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
దేశభక్తి గీతాలకు చిన్నారుల నృత్యప్రదర్శన

ఐక్యతకు కారణం అంబేడ్కర్