షెడ్యూల్ మేరకు పదో తరగతి మూల్యాంకనం
● విద్యాశాఖ ఆర్‌జేడీ విజయభాస్కర్
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ముగించాలని విద్యాశాఖ ఆర్‌జేడీ బి.విజయభాస్కర్ ఆదేశించారు. విజయనగరం సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. మూల్యాంకన ప్రాంగణంలో టీచర్లకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు ఉన్నారు.
బాధ్యతల స్వీకరణ ˘
విజయనగరం అర్బన్: జిల్లా ఖజానాశాఖ ఉప సంచాలకుడిగా వి.నాగమహేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్‌ఏఎస్ కుమార్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం నాగమహేష్‌ను ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా డీటీ అండ్ ఏఓ ఏ.మన్మథరావు, ఏటీఓ కె.శ్రీనివాసరావు, ఉమ్మడి విజయనగరం జిల్లా ఉప ఖజానా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైవాడ కాలువలో ఆటో బోల్తా
● తప్పిన ప్రమాదం
● ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
వేపాడ: మండలంలోని బల్లంకి నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో రైవాడ కాలువపై ఏర్పాటుచేసిన తాత్కాలిక కల్వర్టుపై మంగళవారం ఆటో అదుపు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది. ఆటోలో బల్లంకి గ్రామానికి వెళ్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆటోను స్థానికుల సహాయంతో బయటకు తీశారు. జనవరిలో రైవాడ కాలువపై ఉన్న కల్వర్టు కూలిపోవడంతో గ్రామస్తులు తాటిదుంగలతో తాత్కాలిక కల్వర్టును ఏర్పాటుచేశారు. దీనిపై నుంచి గతంలో పిక్కలారీ వెళ్లడంతో కూలిపోయింది. ఇదే తాత్కాలిక కల్వర్టుపై ఇప్పుడు ఆటో బోల్తాకొట్టింది. జీవీఎంసీ అధికారులు, స్థానిక పాలకులు స్పందించి బల్లంకి–ఆనందపురం రోడ్డులో రైవాడ కాలువపై శాశ్వత కల్వర్టు నిర్మించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
షెడ్యూల్ మేరకు పదో తరగతి మూల్యాంకనం
షెడ్యూల్ మేరకు పదో తరగతి మూల్యాంకనం


