● ప్రమాదంలో గాయపడిన
కుమారుడి మృతి
● ఐదేళ్లపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ప్రణీత్‌బాబు
● జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించిన
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు
● సంతాపం తెలిపిన మాజీ సీఎం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కు పుత్ర వియోగం కలిగింది. ఆయన రెండవ కుమారుడు మజ్జి ప్రణీత్‌బాబు(20) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. 2020 సంవత్సరం మే 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ నాలుగు సంవత్సరాల పదినెలల పాటు మృత్యువుతో పోరాడారు. కరోనా విపత్కర సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని విశాఖ నుంచి విజయనగరంలోని ధర్మపురిలో గల మజ్జి శ్రీనివాసరావు ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సందర్శన అనంతరం తోటపాలెంలోని రోటరీ స్వర్గధామంలో బంధువులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సంప్రదాయబద్ధంగా మజ్జి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నశ్రీనును మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి ఓదార్చారు.
తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
తమ అభిమాన నాయకుడు మజ్జి శ్రీనివాసరావు రెండవ కుమారుడు ప్రణీత్‌బాబు మరణవార్త తెలుసుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రముఖ నాయకులు, వైస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు. జిల్లా నాయకులతో పాటు వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రణీత్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిన్నశ్రీను ఇంట విషాదం
చిన్నశ్రీను ఇంట విషాదం