దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Jul 22 2024 12:20 AM | Updated on Jun 25 2026 11:01 AM

-

●రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ●పది మందికి గాయాలు ●మితిమీరిన వేగం వల్లే ప్రమాదం 
 

డెంకాడ:

మితిమీరిన వేగం మృత్యువైంది. ఇద్దరు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని జొన్నాడ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. జొన్నాడ గ్రామం వద్ద జాతీయ రహదారిపై విజయనగ రం నుంచి విశాఖ వైపు మితిమీరిన వేగంతో వచ్చిన వ్యాన్‌ అదే వైపు నుంచి వస్తున్న సైక్లిస్ట్‌ను ఢీకొని, కాలకృత్యం కోసం వెళ్లి తన కారు వద్దకు నడిచి వస్తున్న మరో వ్యక్తిని ఢీకొట్టింది. అదుపు తప్పిన వ్యాన్‌ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. బొడ్డవలస గ్రామానికి చెందిన చందక లక్ష్మణరావు సైకిల్‌పై బొడ్డవలస నుంచి జొన్నాడకు వెళ్తున్నాడు. అలాగే పార్వతీపు రం మండలం చినబొండపల్లి నుంచి వస్తున్న కారు జొన్నాడ వద్ద రోడ్డు పక్కన ఆపి కారులో కుటుంబసభ్యులు ఉండడంతో కాలకృత్యాల కో సం తురక ప్రవీణ్‌చంద్‌(34) ముందుకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని నడుచుకుని వస్తున్నా డు. వీరిద్దరిని వ్యాన్‌ ఢీకొని అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తు న్న పూసపాటిరేగ మండలంలోని గుంపాం గ్రా మానికి చెందిన బాడితమాని సన్యాసి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తురక ప్రవీణ్‌చంద్‌తో పాటు వ్యాన్‌లో ప్రయాణి స్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికి త్స కోసం విజయనగరం ఆస్పత్రికి తరలించా రు. అప్పటికే ప్రవీణ్‌చంద్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చందక లక్ష్మణకు తల, వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈయన తో పాటు ఒ.సాయి, వై.యోగి, ఒ.తాతారావు, జి.బంగారయ్య, ఎస్‌కే శ్రీను, వై.కామరాజు, జి. రామకృష్ణ, జి.బంగార్రాజు, జి. సూరిరమణ గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో అక్కివరం, డి.తాళ్లవలస, దాకమర్రి, బంగార్రాజుపేట తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఎస్‌ఐ ఎం. కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

మరణించిన తురక ప్రవీణ్‌చంద్‌ సాఫ్ట్‌వే ర్‌ ఇంజినీర్‌. గుంటూ రు జిల్లా ఫిరంగి పు రం మండలంలోని నుదురుపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్‌చంద్‌ అత్తవారు గ్రామమైన పార్వతీపురం మండలంలోని చినబొండపల్లి నుంచి సొంత గ్రామమై న నుదురుపాడుకు కారులో వెళ్తున్నాడు. జొన్నా డ వద్ద కాలకృత్యాలకని దిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. మృతుని భార్య సుష్మిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

ప్రమాద స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను ఎస్‌ఐ ఎం.కృష్ణమూర్తిని అడి గి తెలుసుకున్నారు.

దూసుకొచ్చిన మృత్యువు 1
1/2

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు 2
2/2

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement