జెండాను ఎగరవేసిన మంత్రి | - | Sakshi
Sakshi News home page

జెండాను ఎగరవేసిన మంత్రి

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

రాష్ట్ర రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. పరేడ్‌ కమాండర్‌ ఆధ్వర్యంలోని పోలీసు దళం మంత్రికి సెల్యూట్‌ సమర్పించగా.. బ్యాండ్‌ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పరేడ్‌ కమాండర్‌ స్వాగతం మేరకు మంత్రి పరేడ్‌ మైదానాన్ని సందర్శించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు దళాలు కవాతు నిర్వహించాయి.

జాతీయ పతాకానికి గౌరవ

వందనం చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు

ప్రతిభా పురస్కారాలు ప్రదానం

వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, సేవకులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పని చేస్తున్న 521 మంది అధికారులు, సిబ్బంది ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. అయితే, ఎవరి ప్రశంసా పత్రం వారికి అందలేదు. కొందరు ప్రశంసా పత్రాలు అందుకున్నా వారి పేరు లేకపోవడంతో మార్పులు చేయడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement