విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

విజయనగరం గంటస్తంభం/విజయనగరం క్రైమ్‌:

స్వాతంత్య్ర వేడుకలు సాక్షిగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లాలో త్రివర్ణ శోభితం పరిమళించింది. దేశభక్తి ఉప్పొంగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు జాతీయ జెండాను చేతబూని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. మువ్వన్నెల వెలుగుల్లో మురిసిపోయారు. విజయనగరం పోలీస్‌ పరేడ్‌ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు సంబరంగా సాగాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, పోలీసు రక్షక దళాలు కవాతు, పోలీస్‌ జాగిలాల విన్యాసాలు, తదితర అధికారిక ప్రక్రియల నడుమ వేడుకలు ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగాయి. వివిధ శాఖలు తమ పరిధిలో జరిగిన ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించాయి.

పోలీసుల కవాతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement