భీమిలి సభను విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

భీమిలి సభను విజయవంతం చేద్దాం

Jan 20 2024 12:34 AM | Updated on Feb 3 2024 6:09 PM

- - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ఎన్నికల శంఖారావం పూరించడంలో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈ నెల 25న వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పార్టీ నాయకులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లిమర్ల నియోజకవర్గానికి సమీపంలో భీమిలి ఉందని, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభకు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని సూచించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, వైస్‌ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు, డెంకాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు రొంగలి కనకసింహాలచం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement