పూడుకుపోయిన కాలువలు | - | Sakshi
Sakshi News home page

పూడుకుపోయిన కాలువలు

Jul 23 2026 2:12 AM | Updated on Jul 23 2026 2:12 AM

uu

మెంటాడ: లోగుగెడ్డ ప్రాజెక్టు కాలువలు పూడికలతో నిండిపోవడం రైతులకు శాపంగా మారింది. సాగునీరు విడుదల చేసినా ఆయకట్టుకు అందని పరిస్థితి. ఎడమ ప్రధాన కాలువ నుంచి సుమారు 4,630 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలి. రిజర్వాయర్‌ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాలువ ఐదున్నర అడుగుల లోతుకు, ఐదు అడుగుల మేర పూర్తిగా మట్టి, ఇసుక, పిచ్చిమొక్కలతో పూడుకుపోయింది. దీంతో నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదు. ప్రధాన కాలువ నుంచి విడిపోయే ఆర్‌ఎల్‌–1 కాలువ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు పరిధిలోని కాలువలను బాగుచేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement