● కురవని వాన.. నిండని ప్రాజెక్టులు ● జూలై నెల చివరిలోనూ ముందుకు సాగని వరి ఉభాలు ● అస్తవ్యస్తంగా సాగునీటి కాలువలు ● బీడు భూములుగా పంట పొలాలు ● ఆ‘వెద’నలో రైతాంగం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జిల్లాలోని 22 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. విజయనగరం జిల్లా 27 మండలాలు ఉంటే అందులో 22 మండలాల్లో వర్షాభావం నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 1, 23,608 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 22,115 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఇందులో వరి 9,305 హెక్టార్లు, మొక్కజొన్న 6,713, చోడి 25, కొర్ర 4, సామ 3, కంది 7, పెసర 15, మినుము 31, వేరుశనగ 70, నువ్వులు 2,367, పత్తి 1954, గోగు 110, చెరకు 1511
ఆదుకోవాలి..
జిల్లా వ్యాప్తంగా నారుమడులు, వెద పద్దతిలో వేసిన వరి పంట వర్షాలు లేక ఎండిపోతున్నాయి. బోర్లు ఉన్నచోట కొంతమంది రైతులు ఆయిల్ ఇంజిన్లు ద్వారా పంటను అష్టకష్టాలు పడి కాపాడుకుంటున్నారు. మిగిలిన చోట రైతులకు ఉచితంగా ప్రభుత్వం విత్తనాలను అందించి ఆదుకోవాలి.
– బుద్దరాజు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి


