పాచిపెంట: పెద్దగెడ్డ ఆయకట్టుకు నీటిగండం నెలకొంది. ఆశించిన వర్షాలు లేకపోవడంతో 12 వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి కనిపించడంలేదు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 210.50 మీటర్లు ఉంది. నీటిమట్టం పెరిగితేనే పంటలకు ఊరట లభిస్తుందని, లేకుంటే నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టిన 50 క్యూసెక్కుల సాగునీరు ఎటూ సరిపోదని, ఆయకట్టుకు నీరు అందించాలంటే 150 క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉందని చెబుతున్నారు. వర్షాలు కురవకుంటే 15 రోజుల్లోనే జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం ఉందన్నారు.
నారు మడులు ఎండిపోతున్నాయి...
పెద్దగెడ్డ జలాశయంలో నీరు ఉన్నా పంటల సాగుకు సరిపోయినంత లేదు. వర్షాలు కురవడం లేదు. నారు మడులు ఎండిపోతున్నాయి. శివారు భూమలుకు చుక్కనీరు అందే పరిస్థితి కనిపించడంలేదు.
– ఈదుబిల్లి సుదీర్ నాయుడు, రైతు, మిర్తివలస


