
కలశ జ్యోతుల ఊరేగింపులో స్వాములు, ఇతరులు
విజయనగరం టౌన్: పైడితల్లి నామస్మరణతో విజయనగరం పట్టణం పులకించిపోయింది. మాలధారుల జైజై పైడిమాంబ నామస్మరణ, కలశ జ్యోతుల వెలుగులో అమ్మవారి శోభాయాత్ర శనివారం వైభవంగా సాగింది. వనంగుడి నుంచి చదురుగుడి వరకు దారిపొడవునా భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. చల్లంగ చూడాలంటూ తల్లిని శరణువేడారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో సాగిన కలశ శ్యోతుల యాత్రను ఈఓ కె.ఎల్.సుధారాణి స్వీయపర్యవేక్షణ చేశారు. అమ్మవారి ఉత్సవ రథంతో చదురుగుడి వరకూ దీక్షధారులతో కలిసి నడిచారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు తాతా రాజేష్, దూసి శివప్రసాద్, సాయికిరణ్‌లు అమ్మవారికి ఉదయం నుంచి శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, అచ్చిరెడ్డిల నిర్వహణలో దీక్షదారులు భజనలు చేశారు.
ఊరంతా అమ్మవారి వెలుగులు
వనంగుడి నుంచి ప్రారంభమైన కలశ జ్యోతుల ర్యాలీ గాడీఖానా, వైఎస్సార్ కూడలి, ఎన్‌సీఎస్ రోడ్డు, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుంది. దారిపొడవునా మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించి, తరించారు. కలశజ్యోతుల ర్యాలీతో నగరానికి దీపశోభ చేకూరింది.
వేదమంత్రాలతో మార్మోగిన వనంగుడి
పైడితల్లికి పంచామృతాలతో
అభిషేకాలు
కలశజ్యోతులు పట్టుకుని దీక్షాపరుల ర్యాలీ
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

చదురుగుడిలో ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు

రథాన్ని లాగుతున్న ఆలయ సిబ్బంది, భక్తులు