
విజయనగరం రైల్వేస్టేషన్‌లోకి వస్తున్న గూడ్స్ బుధవారం పట్టాలు తప్పింది.
విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్‌లోకి వస్తున్న గూడ్స్ బుధవారం పట్టాలు తప్పింది. విజయనగరం నుంచి పలాస వెళ్లేందుకు రూట్ నంబర్ తొమ్మిదిలో ఖాళీ గూడ్స్ బయలుదేరింది. ట్రాక్ మారుతున్న సమయంలో కిలోమీటర్ నంబర్ 817/37 ట్రాక్ వద్ద చక్రం పట్టా తప్పింది.
డ్రైవర్ గుర్తించి వెంటనే బండిని నిలిపివేసి, అధికారులకు సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విశాఖ నుంచి ప్రత్యేక క్రేన్‌ను తెప్పించి కేవలం గంట వ్యవధిలోనే సమస్యను పరిష్కరించారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.