మహారాణిపేట: జిల్లాలో డిసెంబర్ 2న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అర్హులైన సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే విశాఖ గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన సిబ్బంది తమకు కేటాయించిన ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, నిర్ణీత సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.


