నేవీ డేకి పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నేవీ డేకి పక్కా ఏర్పాట్లు

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

మహారాణిపేట : విశాఖలో డిసెంబర్‌ 4న నేవీ డే–2026, 13న వైజాగ్‌ నేవీ మారథాన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నేవీ, జిల్లా అధికారులతో ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌ 3న ఆర్‌కే బీచ్‌లో ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌, 4న నేవల్‌ ఆపరేషనల్‌ డెమాన్‌స్ట్రేషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. నేవీ డే సందర్భంగా కార్యక్రమాలు జరిగే ప్రాంతాన్ని నో డ్రోన్‌ ఫ్లై జోన్‌గా పరిగణించాలని నేవీ అధికారులు కోరారు. ఈ మేరకు పోలీసు, జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు వచ్చే అతిథులు, ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, పార్కింగ్‌, విద్యుత్‌ సరఫరా, మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలని కోరారు.

15 వేల మందితో మారథాన్‌

డిసెంబర్‌ 13న జరిగే వైజాగ్‌ నేవీ మారథాన్‌లో 15 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు. 42 కిలోమీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ రన్‌, 21 కిలోమీటర్ల సబ్‌మైరెన్‌ రన్‌, 10 కిలోమీటర్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ రన్‌, 5 కిలోమీటర్ల ఫ్రిగేట్‌ రన్‌ ఉంటాయని పేర్కొన్నారు. ఆర్‌కే బీచ్‌లో ప్రారంభమయ్యే పరుగులు భీమునిపట్నంలోని ఐఎన్‌ఎస్‌ కళింగ వరకు కొనసాగుతాయని వివరించారు. మారథాన్‌ విజయవంతానికి జిల్లా యంత్రాంగం సహకరించాలని నేవీ అధికారులు కోరారు. మారథాన్‌ వివరాలకు www. vizagnavymarathon.run వెబ్‌సైట్‌ లేదా 7386007503, 9515448412 నంబర్లను సంప్రదించవచ్చు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.విద్యాధరి, డీసీపీ చందోలు మణికంఠ, డీఆర్‌ఓ ఎస్‌.డి.అనిత, నేవీ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement