సాగర తీరంలో లక్ష్మీ వైభవం | - | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో లక్ష్మీ వైభవం

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

తిరుమల తిరుపతి దేవస్థానం, ఎస్‌వీబీసీ చానెల్‌ ఆధ్వర్యంలో హైవే వెంచర్స్‌ సంస్థ సౌజన్యంతో బీచ్‌రోడ్డులో నిర్వహించిన శ్రీమహాలక్ష్మి పూజా కార్యక్రమం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. తిరుచానూరు నుంచి తీసుకొచ్చిన పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు మహాలక్ష్మి పూజా కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సాగర తీరంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నగరవాసులను భక్తి పరవశంలో ముంచెత్తింది. మహిళలు పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేంకటేశ్వర భక్తి చానల్‌ చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌, వైవీ వెంచర్స్‌ ఎండీ చింతాడ హేమారావు తదితరులు పాల్గొన్నారు. – ఏయూక్యాంపస్‌

పూజల్లో పాల్గొన్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement