అప్పన్న సేవలు, దర్శన సమయాల్లో మార్పులు | - | Sakshi
Sakshi News home page

అప్పన్న సేవలు, దర్శన సమయాల్లో మార్పులు

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

సింహాచలం: సింహగిరిపై ఈనెల 20న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు రాత్రి 7 గంటల వరకే లభిస్తాయని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు రాత్రి కై శిక పురాణ విన్నపం, గ్రామతిరువీధి కారణంగా రాత్రి ఆరాధన టిక్కెట్లు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 20 నుంచి 24 వరకు తిరుమంగై ఆళ్వారు తిరునక్షత్రం పూజలు సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ, ఉదయం, రాత్రి వేళల్లో ఆరాధన సేవలు మినహా మిగతా అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న వృశ్చిక దీపారాధన పురస్కరించుకుని వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు ఆరోజు రాత్రి 7 గంటల వరకే లభిస్తాయన్నారు. ఆరోజు కూడా రాత్రి ఆరాధన టిక్కెట్లు రద్దుచేసినట్లు పేర్కొన్నారు. భక్తులంతా ఈ విషయాలను గమనించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement