హైకోర్టు ఆదేశాలతో పింఛన్‌ పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలతో పింఛన్‌ పునరుద్ధరణ

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

మహారాణిపేట: లంకవానిపాలేనికి చెందిన పెనుగంటి కనకమహాలక్ష్మి ఒంటరి మహిళ జీవితం గడుపుతోంది. గ్రామంలో రాజకీయ కారణాలతో ఆమెకు పెళ్లయిందని సాకు చూపుతూ మూడేళ్లుగా ఒంటరి మహిళ పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆమె అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. ప్రయోజనం లేకపోయింది. చివరికి హైకోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల పాటు సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు ఒంటరి మహిళ పెన్షన్‌ను పునరుద్ధరించింది. కోర్టు ఆదేశాలతో లంకవానిపాలెం గ్రామానికి చెందిన కార్యదర్శి శుక్రవారం కనకమహాలక్ష్మికి ఒంటరి మహిళ పెన్షన్‌ అందజేశారు. ముందుగా ఆమెకు హైకోర్టు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్‌ కాపీని న్యాయవాదులు యాదవ్‌, రమేష్‌, మాధురి తదితరులు విశాఖపట్నం కోర్టు ప్రాంగణంలో అందించారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కనకమహాలక్ష్మి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement