● సాగర సోయగాలకు పావురాల పరవశం | - | Sakshi
Sakshi News home page

● సాగర సోయగాలకు పావురాల పరవశం

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

అలల అలల సవ్వడికి తోడుగా... ఆకాశంలో రెక్కల సందడి. సాగరతీరంలో కపోతాలు కనువిందు చేస్తున్నాయి. ఆర్కే బీచ్‌ వద్ద ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వందలాది పావురాలు చేరి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. తెల్లని రెక్కలతో గుంపులుగా విహరిస్తూ, తీరమంతా సందడి చేసే ఈ కపోతాలు బీచ్‌ అందాలకు మరింత వన్నె తెస్తున్నాయి. సముద్రపు గాలి ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు, స్థానికులు వీటితో మమేకమవుతూ మురిసిపోతున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చే వారు పావురాలతో ఫొటోలు దిగుతూ ఆ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు.అలల గానం... పావురాల పయనం... సందర్శకుల ఆనందం... ఇలా ఆర్కే బీచ్‌ ఉదయం వేళల్లో ప్రకృతి, పక్షులు, మనుషుల మధ్య ఓ అందమైన అనుబంధానికి వేదికగా మారుతోంది. – ఏయూక్యాంపస్‌/ఫొటో సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement