విజయవంతంగా 500 ప్లస్‌ రోబోటిక్‌ సర్జరీలు | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా 500 ప్లస్‌ రోబోటిక్‌ సర్జరీలు

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఘనత

మహాత్మాగాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఘనత

ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీలోని మహాత్మగాంధీ క్యాన్సర్‌ హాస్పటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో 500 రోబోటిక్‌ క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన తొలి క్యాన్సర్‌ హాస్పటల్‌గా ఎంజీ క్యాన్సర్‌ హాస్పటల్‌ నిలిచిందన్నారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోబోటిక్‌ శస్త్రచికిత్సల వ్యవస్థను తమ హాస్పటల్‌లో ఏర్పాటు చేయడంతో ఈ ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. క్యాన్సర్‌ శస్త్రచికిత్సల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కచ్చితత్వం, నైపుణ్యంతో 500కు పైగా రోబోటిక్‌ క్యాన్సర్‌ సర్జరీలు విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ బి. మురళీధర్‌ మాట్లాడుతూ శరీరంలోని ఇరుకై న భాగాల్లో మరింత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రోబోటిక్‌ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2018 నుంచే ఈ అధునాతన శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సత్య విజయ్‌ చిగురుపాటి, యూరో ఆంకాలజిస్ట్‌–రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రాహుల్‌ తేజ్‌, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రేమ్‌ కమల్‌ పట్నాల, కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ గుడ్ల అనంత సాయికుమార్‌, కన్సల్టెంట్‌ గైనెక్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ హరిత మద్దిరాల తదితరులు రోబోటిక్‌ సర్జరీల ద్వారా క్లిష్టమైన కేసుల్లో అందించిన వైద్య సేవల అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement