ఘనంగా 104వ ఎంఈఎస్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా 104వ ఎంఈఎస్‌ దినోత్సవం

Oct 2 2026 12:34 AM | Updated on Oct 2 2026 12:34 AM

సింథియా: భారత సాయుధ దళాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆపరేషనల్‌ సన్నద్ధతకు మిలటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌(ఎంఈఎస్‌) అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. నావల్‌ బేస్‌లో సెప్టెంబర్‌ 28–29 తేదీల్లో 104వ ఎంఈఎస్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల వేడుకల్లో సాంకేతిక అవగాహన సదస్సులు, ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రక్షణ మౌలిక సదుపాయాలకు అవసరమైన ఆధునిక ఇంజనీరింగ్‌ పరిష్కారాలను తెలుసుకోవడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో తూర్పు నావల్‌ కమాండ్‌(ఈఎన్‌సీ) చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ సుశీల్‌ మీనన్‌, ఏవీఎస్‌ఎం, వీఎస్‌ఎం పాల్గొని ఎంఈఎస్‌ సిబ్బందితో ముచ్చటించారు. సాయుధ దళాల ఆపరేషనల్‌ సామర్థ్యాలను పెంపొందించడంలో వారు చేస్తున్న కృషిని, వృత్తిపరమైన సేవలను అభినందించారు. ఈఎన్‌సీ పరిధిలో మౌలిక సదుపాయాల విస్తరణ, కీలక ఆస్తుల నిర్వహణ, ఆపరేషనల్‌ సన్నద్ధత కోసం ఎంఈఎస్‌ అందిస్తున్న సేవలను విశాఖపట్నం చీఫ్‌ ఇంజనీర్‌(నేవీ) పంకజ్‌ త్యాగి ఈ సందర్భంగా కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement