ద్వారకానగర్: కేవీఆర్ గ్రూప్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను సీతమ్మధారలోని కేవీఆర్ ఎస్టేట్ కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. విదేశీ పర్యటనలో ఉన్న వెంకటరెడ్డి తరఫున ఆయన సోదరుడు కాయల సూరారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేవీఆర్ కుమారుడు కాయల రవికృష్ణారెడ్డి, కొవ్వూరి బాలరెడ్డి, కర్రి మురళీకృష్ణారెడ్డి, సత్తి వీర వెంకట సత్యనారాయణరెడ్డి, గుజ్జు వెంకటరెడ్డి, కర్రి రామరెడ్డి, సాడి పద్మారెడ్డి, కుమారరెడ్డి, వివేకానందరెడ్డి, శ్రీను వాసురెడ్డితో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.


