మహారాణిపేట: విశాఖలోని ఎలిగెంట్ హోటల్ ప్రతిష్టాత్మక ఏపీ స్టేట్ యాన్యువల్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో బెస్ట్ బడ్జెట్ హోటల్ అవార్డును వరుసగా నాలుగోసారి అందుకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందజేశారు. ఎలిగెంట్ హోటల్ తరఫున మేనేజింగ్ పార్ట్‌నర్ ఎం.బి. పవన్ కార్తీక్, హోటల్ మేనేజర్ పి.ఎల్.ఎన్. మూర్తి స్వీకరించారు. ఈ సందర్భంగా పావన్ కార్తీక్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగోసారి అవార్డు రావడం గర్వకారణమని, గుర్తింపు అందించిన పర్యాటక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.


