అభివృద్ధి పనుల్లో సింహభాగం విశాఖకే | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో సింహభాగం విశాఖకే

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్ల పనులు విశాఖలో రూ.3,892 కోట్లతో 16 ప్రాజెక్టులు 2027 మార్చి నాటికి పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ వర్షంలో తడుస్తూనే మహిళల తిరుగుముఖం

మధురవాడ: రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో విశాఖకు రూ.3,892 కోట్లతో 16 ప్రాజెక్టులు దక్కాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం కుప్పం నుంచి సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పీఎంపాలెం వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ విశాఖలో చేపట్టే పనులన్నింటినీ 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. నగరానికి డబుల్‌ డెక్కర్‌ మెట్రో రైలు రానుందని చెప్పారు. ప్రాజెక్టుల టెండర్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. సాలిడ్‌ వేస్ట్‌, లిక్విడ్‌ వేస్ట్‌, ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాత నగరంలో జరిగిన లోపాలు ప్రస్తుత పనుల్లో పునరావృతం కాకూడదని ఎంపీ భరత్‌ అన్నారు. ఎండాడతో పాటు నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్డు స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ తన పేరును నాయకులు ఇప్పుడు మరిచిపోయినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇచ్చే సమయంలో మాత్రం మరిచిపోవద్దంటూ టీడీపీ నేతలకు చురకలు అంటించారు. నగరంలో రహదారులు, ట్రాఫిక్‌ నిర్వహణ, డ్రైనేజీలు, వీధిలైట్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. కోస్టల్‌ కారిడార్‌ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, రామకృష్ణబాబు, గణబాబు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లలో వైఫల్యం : ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా మహిళలను సభకు తరలించారు. వర్షంలో తడుస్తూనే పలువురు వెనుదిరిగారు. మరుగుదొడ్లు, భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంత్రి నారాయణ మాట్లాడుతుండగానే పలువురు మహిళలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement