ఎలక్రికల్‌ కేబుల్‌ వైర్ల చోరీలో ముగ్గురికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలక్రికల్‌ కేబుల్‌ వైర్ల చోరీలో ముగ్గురికి రిమాండ్‌

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

770 కిలోల అల్యూమినియం, 110 కిలోల ప్రొటెక్షన్‌ వైర్‌, ఓ వ్యాన్‌ స్వాధీనం

పరవాడ: అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ వైర్‌ చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు మీడియాకు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి... జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉంచిన అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ వైర్‌ను గత నెల 25న గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించి, దొంగిలించుకుపోయారు. దీనిపై యాజమాన్యం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ.మర్రిపాలెం ఎస్‌కే యాడ్‌ సమీపంలో సదరు దొంగతానికి పాల్పడిన పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్‌కు చెందిన షేక్‌ నబీల్‌(20), అదే మండలం రామచంద్రనగర్‌కు చెందిన పెండ్ర వెంకటేష్‌(26) ఆసనాల రవి(25)ని మంగళవారం అరెస్టు చేసినట్టు సీఐ వెల్లడించారు. వారు అప్పటికే కేబుల్‌ వైర్‌ను కరిగించి అల్యూమినియం దిమ్మలుగా మార్చేశారు. నిందితు నుంచి సుమారు 770 కిలోల 30 అల్యూమినియం దిమ్మలు, 110 కిలోల ప్రొటెక్షన్‌ వైర్‌ను, చోరీకి ఉపయోగించిన టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. షేక్‌ నబీల్‌పై గాజువాక, న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్లలో ఐదు చోరీ కేసులు ఉన్నాయి. పెండ్ర వెంకటేష్‌పై పరవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఓ చోరీ కేసు నమోదై ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement