పవిత్రోత్సవాలకు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

సింహాచలం: సింహగిరిపై సోమవారం నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో తొలుత రుత్విక్‌ వరణం, ఉత్సవాంగీకారం జరిపారు. చక్రపెరుమాళ్లను కల్యాణమండపం వద్దకు తీసుకొచ్చి వేదికపై వేంజేపచేశారు. పుట్టమనున్న స్వామి వద్ద ఉంచి మృత్సగ్రహణం నిర్వహించారు. ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు శిరస్సుపై పుట్టమన్ను పెట్టుకుని, పాలికల్లో వేసి అంకురార్పణ జరిపారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. అర్చకులు, రుత్విక్‌లకు దీక్షా వస్త్రాలను ఈవో అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement