అక్టోబర్‌ 10, 11 తేదీల్లో ‘కామిక్‌ కాన్‌ ఇండియా’ | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 10, 11 తేదీల్లో ‘కామిక్‌ కాన్‌ ఇండియా’

Aug 26 2026 1:42 AM | Updated on Aug 26 2026 1:42 AM

పెదగంట్యాడ: దేశంలోనే అతి పెద్ద పాప్‌ కల్చర్‌ వేడుక ‘కామిక్‌ కాన్‌ ఇండియా 2026–27 సీజన్‌ను అక్టోబర్‌ 10, 11 తేదీల్లో ఏఎంటీజెడ్‌లోని కలాం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నామని కామిక్‌ కాన్‌ ఇండియా సీఈవో షెఫాలీ జాన్సన్‌ తెలిపారు. మండలంలోని ప్రగతి మైదాన్‌ వద్ద గల మెడ్‌టెక్‌ (ఏఎంటీజెడ్‌)లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలో అంతర్జాతీయ అతిథుల హాజరుతో పాటు కాస్టూమ్స్‌ విన్యాసాలు (కాస్‌ప్లే), ఇంటరాక్టివ్‌ చర్చ వంటి పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యానిమే, కాస్‌ప్లే ద్వారా కొత్త లోకాన్ని పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. నోడ్విన్‌ గేమింగ్‌ కోఫౌండర్‌, ఎండీ అక్షత్‌ రాఠీ మాట్లాడుతూ గత సీజన్‌లో అభిమానుల నుంచి వచ్చిన స్పందనను చూసి ఈ సీజన్‌ను విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్‌లో కామిక్‌ కాన్‌ గేమర్లు, కామిక్‌ పుస్తకాల ప్రేమికులు, కంటెంట్‌ సృష్టికర్తలు, లైవ్‌ మ్యూజిక్‌, స్టాండప్‌ కామెడీ వంటి వాటిని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement