నేత్రదానంపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

నేత్రదానంపై అవగాహన కల్పించాలి

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

8లో

పారదర్శక ఓటర్ల జాబితాకు పార్టీల సహకారం

మహారాణిపేట: నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 25 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించే పక్షోత్సవాల్లో ప్రజలకు నేత్రదానంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. అపోహలను తొలగించి స్వచ్ఛందంగా నేత్రదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, రీజనల్‌ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మీనాక్షి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, ఎన్టీఆర్‌ వైద్యసేవ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ అప్పారావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నరేంద్ర సింగ్‌, నేత్రదాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement