విశాఖలో ఐఎంసీసీఐ గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో ఐఎంసీసీఐ గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

డాబాగార్డెన్స్‌: దేశీయ, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్‌ మైనార్టీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఐఎంసీసీఐ) గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌ను విశాఖలో ప్రారంభించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కంపెనీస్‌ యాక్ట్‌–2013లోని సెక్షన్‌–8 కింద ఏర్పాటైన ఐఎంసీసీఐ దేశ, విదేశాల్లోని వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, వృత్తి నిపుణులు, సంస్థలను అనుసంధానం చేసేందుకు కృషి చేస్తుందని సంస్థ జాతీయ చైర్మన్‌ కేఎం చిస్టీ (బాబు), వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఖాజా తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆనంద, ఎండీ హుస్సేన్‌, డాక్టర్‌ అస్లాం, ఎండీ కై జర్‌, రైజ్‌ అహ్మద్‌, సీఈవో మహ్మద్‌ షమ్స్‌ తబ్రేజ్‌, మహిళా పారిశ్రామికవేత్తల విభాగం డైరెక్టర్‌ అఫ్రిన్‌ ఆర్జా, న్యాయ విభాగం డైరెక్టర్లు షేక్‌ బాజీ, షేక్‌ ముజాహిద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement