ఘనంగా అప్పన్న నిత్యాన్నదాన పథకం వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా అప్పన్న నిత్యాన్నదాన పథకం వార్షికోత్సవం

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నిత్యాన్నదాన పథకం 38వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన భవనంలో దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. సాధారణ వంటకాలతో పాటు వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సిద్ధం చేసిన స్వీట్‌, పులిహోర ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో తిరుమలేశ్వరరావు, అన్నప్రసాద విభాగం ఏఈవో రమణమూర్తి, సూపరింటెండెంట్‌ పాలురి నరసింగరావు, సిబ్బంది, పీఆర్‌వో అప్పలనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement