కొమ్మాది: సినీ తారల రాకతో విశాఖలో శుక్రవారం సందడి నెలకొంది. నగరంలో శనివారం జరగనున్న సినిమా షూటింగ్‌ల కోసం సినీ హీరో అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య శోభిత శుక్రవారం విశాఖకు వచ్చారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వారు అనంతరం నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం కై లాసగిరి, యారాడ బీచ్ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్‌లో నాగచైతన్య పాల్గొననున్నారు.
మీనాక్షి చౌదరి రాక
ప్రముఖ నటి మీనాక్షి చౌదరి కూడా షూటింగ్ నిమిత్తం శుక్రవారం నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బీచ్ రోడ్డులోని నోవోటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేశారు. అలాగే దర్శకుడు తేజ కూడా తన నూతన సినిమా షూటింగ్ నిమిత్తం నగరానికి వచ్చారు.


