పెదగంట్యాడ: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ఫలితాల్లో నడుపూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు వరుసగా ఐదేళ్ల పాటు ఉత్తమ ఫలితాలు సాధించడంతో హెచ్‌ఎం రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన నమ్మి సన, శ్రీరామ్ సాహులతో పాటు మరో 18 మంది విద్యార్థులను ఆయన అభినందించారు. హెచ్‌ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు 2021–22 విద్యా సంవత్సరంలో 15 మంది, 2022–23లో 19 మంది, 2023–24లో 27 మంది, 2024–25లో 21 మంది, 2025–26లో 20 ఎంపికయ్యారని తెలిపారు. అనంతరం నెల్లిముక్కు, పెదగంట్యాడ జంక్షన్, మొల్లివానిపాలెం, అయ్యన్నపాలెం, సీతానగరం తదితర ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఎంఈవో రమణాజీ, ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, మురళి, శివ, బాబ్జీ, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు


