ప్రశాంతంగా రెండో విడత ఐటీఐ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా రెండో విడత ఐటీఐ కౌన్సెలింగ్‌

Aug 13 2026 12:33 AM | Updated on Aug 13 2026 12:33 AM

కంచరపాలెం: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో రెండో విడత ప్రవేశాల కోసం బుధవారం కౌన్సెలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించినట్లు కంచరపాలెం పాత ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ ఎన్‌.సోల్‌మాన్‌, నరవ ఐటీఐ ప్రిన్సిపాల్‌ బి.విజయలక్ష్మి తెలిపారు. కౌన్సెలింగ్‌కు ఆయా ఐటీఐల్లో మొత్తం 2,305 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో 1,248 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు అధికారులు అర్హత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.వెంకటేశ్వరరావు, పి.దేవుడు, బొత్స ఈశ్వరరావు, పి.వి.బాలాజీ, వంటాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement