ఘనంగా బొత్స అనూష జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బొత్స అనూష జన్మదిన వేడుకలు

Aug 13 2026 12:33 AM | Updated on Aug 13 2026 12:33 AM

మహారాణిపేట: వైఎస్సార్‌సీపీ మహిళా నేత డాక్టర్‌ బొత్స అనూష జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. లాసన్స్‌బే కాలనీలోని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొని డాక్టర్‌ బొత్స అనూషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎస్‌సీసీ సభ్యుడు రవిరెడ్డి, పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్‌, బాణాల శ్రీనివాసరావు, పెడాడ రమణికుమారి, కొండా రాజీవ్‌గాంధీ, పల్లా దుర్గారావు, జీవీ రామచంద్రరావు, స్వరూప్‌, అంబటి శైలేష్‌, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement