డాబాగార్డెన్స్: క్రెడిట్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణాల పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ) రూ.25 కోట్ల చెక్కును బుధవారం మెప్మాకు అందజేసింది. ఏపీజీబీ జనరల్ మేనేజర్ ఎ.రాజశేఖర్, విశాఖ రీజనల్ మేనేజర్ లావేటి అనంతరావు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో ఈ చెక్కును మెప్మా పీడీ బీవీ రమణకు అందజేశారు. లఖ్‌పతి దీదీ, ఎంఎస్‌ఎంఈ, ఎస్‌హెచ్‌జీ విభాగాల్లో ఏపీజీబీ క్రెడిట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు మెప్మా తరఫున పూర్తి సహకారం అందిస్తామని పీడీ బీవీ రమణ హామీ ఇచ్చారు. ఎస్‌ఎంఈ, రిటైల్ విభాగాలకు చెందిన రుణగ్రహీతలకు రూ.1.65 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను జనరల్ మేనేజర్ అందజేశారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌లో భాగంగా ఎల్.కోట మండలం సిరసపల్లి శాఖ ఖాతాదారులకు రూ.20 లక్షలు, రూ.10 లక్షల విలువైన రెండు చెక్కులను అందజేసినట్లు ఏపీజీబీ జనరల్ మేనేజర్ తెలిపారు.


