మహిళల కోసం శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మెషీన్లు | - | Sakshi
Sakshi News home page

మహిళల కోసం శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మెషీన్లు

Aug 13 2026 12:33 AM | Updated on Aug 13 2026 12:33 AM

తాటిచెట్లపాలెం: మహిళా ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యార్థం సౌత్‌ కోస్ట్‌ రైల్వే ఉమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో పలు ప్రాంతాల్లో శానిటరీ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు జ్యోత్స్న బోహ్రా, ఇతర సభ్యులు పరిశీలించారు. న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌, డీఆర్‌ఎం కార్యాలయం, విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని స్లీపర్‌ క్లాస్‌ వెయిటింగ్‌ హాల్‌ వద్ద వీటిని ఏర్పాటు చేశారు. రైల్వే పరిసరాలు, కార్యాలయాల్లో మహిళల ఆరోగ్యం, సౌకర్యం, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement